రెండేళ్ల నాటి హిట్ అండ్ రన్ కేసును రీఓపెన్ చేసిన జూబ్లీ హిల్స్ పోలీసులు... మాజీ ఎమ్మెల్యేకు షాక్
- ఎమ్మెల్యే షకీల్ స్టిక్కర్ గల కారు ఢీకొని బాలుడి మృతి
- స్టిక్కర్ తన స్నేహితుడికి ఇచ్చినట్లు చెప్పిన మాజీ ఎమ్మెల్యే షకీల్
- ఈ ప్రమాదానికి సంబంధించి కారు డ్రైవర్, మరో వ్యక్తిపై ఛార్జిషీట్
- ఈ కేసును మళ్లీ ఓపెన్ చేసిన పోలీసులు
కారుపై ఎమ్మెల్యే షకీల్ పేరుతో స్టిక్కర్ ఉన్నట్లుగా కూడా అప్పుడు గుర్తించారు. అయితే ఆ స్టిక్కర్ వున్న కారు తనది కాదని... తన స్టిక్కర్‌ను స్నేహితుడికి ఇచ్చినట్లు షకీల్ అప్పుడు చెప్పారు. ఈ ప్రమాదానికి సంబంధించి కారు డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు ఛార్జిషీట్ వేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు జూబ్లీ హిల్స్ పోలీసులు ఈ కేసును రీఓపెన్ చేశారు.