పవన్ ఎవరితో తిట్లు తిన్నారో ఆయనే చెప్పాలి: పురందేశ్వరి
- అమరావతిలో రేపు, ఎల్లుండి బీజేపీ ముఖ్య నేతల సమావేశాలు
- ఈ సమావేశాల్లో పొత్తులపై చర్చించే అవకాశం
- ఏపీలో పొత్తులను తమ అగ్రనాయకత్వం నిర్ణయిస్తుందన్న పురందేశ్వరి
ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరిని మీడియా పలకరించింది. పొత్తులకు సంబంధించి పవన్ కల్యాణ్ అధిష్ఠానం అనే పదాన్ని ఎక్కువగా వాడుతున్నారు... ఆయన పదేపదే అధిష్ఠానం అని అంటున్నారు? అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. ఈ ప్రశ్న పవన్ కల్యాణ్ నే అడగాలని పురందేశ్వరి బదులిచ్చారు. అధిష్ఠానం అని చెప్పింది... అలాంటప్పుడు నన్ను ఎలా అడుగుతారు? అని తిరిగి ప్రశ్నించారు.
'పై నుంచి తిట్లు తింటున్నాను' అని కూడా పవన్ కల్యాణ్ చెబుతున్నారు... దీనిపై మీరేమంటారు? అని ఆ మీడియా ప్రతినిధి మరోసారి పురందేశ్వరిని అడిగారు. అందుకు పురందేశ్వరి స్పందిస్తూ... 'దానికి కూడా వివరణ ఆయనే ఇవ్వాలి... నేను కాదు' అని స్పష్టం చేశారు.
ఏపీలో బీజేపీ-జనసేన పొత్తు కొనసాగుతుందా?... బీజేపీ-జనసేన-టీడీపీ పొత్తు ఏర్పడే అవకాశాలు ఉన్నాయా? అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా... పొత్తులను తమ అగ్రనాయకత్వం డిసైడ్ చేస్తుందని పురందేశ్వరి పునరుద్ఘాటించారు.