సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న వరుణ్ తేజ్ 'ఆపరేషన్ వాలెంటైన్'

Operation Valentine completes censor work
  • వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ జంటగా ఆపరేషన్ వాలెంటైన్
  • U/A సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు
  • మార్చి 1న ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం
వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ జంటగా నటించిన చిత్రం ఆపరేషన్ వాలెంటైన్. శక్తిప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చింది. ఓపెనింగ్, టైటిల్స్ మినహాయిస్తే... ఈ సినిమా రన్ టైమ్ 2.04 గంటలు.

ఇందులో వరుణ్ తేజ్ భారత వాయుసేన వింగ్ కమాండర్ రుద్రగా కనిపించనున్నారు. హిందీ, తెలుగు భాషల్లో నిర్మితమైన ఆపరేషన్ వాలెంటైన్ చిత్రం మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

నాడు, పుల్వామా ఉగ్రదాడులకు ప్రతిచర్యగా పాకిస్థాన్ లోకి చొచ్చుకు వెళ్లి మరీ భారత వాయుసేన సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించింది. ఆనాటి ఆపరేషన్ తీరుతెన్నులు, అందులో పాల్గొన్న భారత వాయుసేన సిబ్బంది వీరోచిత విన్యాసాలే ఆపరేషన్ వాలెంటైన్ కథాంశం. 

ఇందులో గ్రాఫిక్స్ కు పెద్దపీట వేశారు. కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లు రోమాంఛకంగా ఉంటాయని చిత్రబృందం చెబుతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కూడా ఆ విషయాన్ని నిర్ధారిస్తోంది.
Advertisement
Operation Valentine
Censor
U/A
Varun Tej
Manushi Chillar
Shakti Pratap Singh Hada
Bollywood
Tollywood

More Telugu News