తిరుమల కొండపై జరుగుతున్న దారుణాలను రమణ దీక్షితులు అందరికీ తెలిసేలా చేశారు: నారా లోకేశ్
- తిరుమల గౌరవ ప్రధాన అర్చకుడి పదవి నుంచి రమణ దీక్షితులును తొలగించిన టీటీడీ
- తిరుమల ప్రతిష్ఠను దెబ్బతీసేలా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారన్న లోకేశ్
- రమణ దీక్షితులుపై వేటు వేయడం బాధాకరమని వ్యాఖ్య
టీటీడీలో జరుగుతున్న అకృత్యాలను బయటపెట్టిన రమణ దీక్షితులుపై వేటు వేయడం బాధాకరమని లోకేశ్ అన్నారు. జరుగుతున్న దారుణాలను భక్తులకు తెలిసేలా రమణ దీక్షితులు చేశారని చెప్పారు. తిరుమల కొండపై టీటీడీ అధికారులు, వైసీపీ నేతలు కలిసి దారుణాలకు ఒడిగడుతున్నారని దుయ్యబట్టారు. రమణ దీక్షితులును అరెస్ట్ చేయడానికి ప్రయత్నించడం సీఎం జగన్ అహంకారానికి నిదర్శనమని చెప్పారు.