స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకు స్వల్ప ఊరటను ఇచ్చిన సుప్రీంకోర్టు
- స్కిల్ కేసులో చంద్రబాబుకు బెయిల్ ఇచ్చిన ఏపీ హైకోర్టు
- బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో ఏపీ సీఐడీ పిటిషన్
- విచారణను మూడు వారాలకు వాయిదా వేసిన సుప్రీం ధర్మాసనం
స్కిల్ కేసులో గత ఏడాది సెప్టెంబర్ లో చంద్రబాబును అరెస్ట్ చేశారు. ఆ తర్వాత చంద్రబాబుకు విజయవాడలోని ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఈ క్రమంలో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇదే సమయంలో ఆయన బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు... చంద్రబాబుకు తొలుత తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత దాన్ని రెగ్యులర్ బెయిల్ గా మార్చింది. దీంతో, చంద్రబాబు బెయిల్ ను రద్దు చేయాలంటూ ఏపీ సీఐడీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.