నన్ను టీవీలో చూపించరా? మా ముఖాలు కూడా చూపించరా?: అసెంబ్లీలో హరీశ్ రావు
- నీటి పారుదల రంగంపై అసెంబ్లీలో శ్వేతపత్రం సందర్భంగా చర్చ
- తమను చూపించడం లేదని ఇంటి నుంచి ఫోన్ చేసి మరీ అడుగుతున్నారన్న హరీశ్ రావు
- అలాంటిదేమీ లేదని... అందర్నీ చూపిస్తామన్న స్పీకర్ ప్రసాద్ కుమార్
శ్వేతపత్రంలో అన్నీ తప్పులే
ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై అబద్ధాలు చెప్పారని హరీశ్ రావు మండిపడ్డారు. శ్వేతపత్రంలోని తప్పుల తడకలను చదివి ప్రజలకు వినిపిస్తామన్నారు. గత ప్రభుత్వంపై పదే పదే అబద్ధాలు చెప్పడం ద్వారా అవే నిజమని ప్రజలను నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇదిలా ఉండగా, మధ్యాహ్నం మంత్రి శ్రీధర్ బాబుతో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు భేటీ అయ్యారు.