అబ్దుల్ కలాంను రాష్ట్రపతి చేసిన వ్యక్తి చంద్రబాబు: జస్టిస్ గోపాలగౌడ
- చంద్రబాబుపై పుస్తకం రచించిన జర్నలిస్టు విక్రమ్
- విజయవాడలో నేడు 'మహా స్వాప్నికుడు' పుస్తకావిష్కరణ
- ముఖ్య అతిథిగా విచ్చేసిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గోపాలగౌడ
- రాజకీయాల్లో చంద్రబాబుకు ప్రత్యేకస్థానముందని కితాబు
చంద్రబాబుపై సీనియర్ జర్నలిస్టు పి.విక్రమ్ రచించిన 'మహా స్వాప్నికుడు' పుస్తకావిష్కరణ నేడు విజయవాడలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జస్టిస్ గోపాలగౌడ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. రాజకీయ రంగంలో చంద్రబాబుకు ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. చంద్రబాబు మానవతావాది, సమాజవాది అని కొనియాడారు.