కేటీఆర్ తన బానిస కుక్కలతో మొరిగిస్తే తగిన బుద్ధి చెబుతాం: ఓయూ విద్యార్థులు
- ఓయూలో కేటీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేసిన విద్యార్థులు
- రేవంత్ రెడ్డిపై ఇష్టారీతిన మాట్లాడిన బాల్క సుమన్... కేటీఆర్కు బానిస అంటూ ఆగ్రహం
- అధికారంలో ఉన్నప్పుడు కూడా అహంకారంతో రెచ్చిపోయారని ఆరోపణ
అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నాయకులు అహంకారంతో రెచ్చిపోయారని ఆరోపించారు. ఇప్పుడు కూడా అదే అహంకారంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. అహంకారాన్ని సహించలేక ఎన్నికల్లో ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ అవినీతిపై చర్చను పక్కదారి పట్టించేందుకు రేవంత్ రెడ్డిపై స్వయంగా కేటీఆరే... బాల్క సుమన్ చేత అలాంటి మాటలు మాట్లాడించారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలపై తన బానిస కుక్కలతో కేటీఆర్ మొరిగిస్తే ఓయూ విద్యార్థులు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.