ఢిల్లీకి వెళ్తున్న జగన్ .. అమిత్‌ షాతో ప్రత్యేక భేటీ?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఢిల్లీకి వెళ్తున్న జగన్ .. అమిత్‌ షాతో ప్రత్యేక భేటీ?

CM Jagan going to Delhi likely to meet Amit Shah
  • పూర్తి స్థాయిలో జగన్ రాజకీయ పర్యటన
  • రాజకీయ సహకారంపై అమిత్ షాతో చర్చిస్తారంటూ ఊహాగానాలు 
  • బీజేపీకి ఒక రాజ్యసభ సీటు ఇచ్చేందుకు సిద్ధమంటూ ప్రచారం 
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నట్టు సమాచారం. అయితే, ఇది అధికారిక పర్యటన కాదని, పూర్తి స్థాయిలో రాజకీయ పర్యటన అని చెపుతున్నారు. రేపు లేదా ఎల్లుండి ఆయన ఢిల్లీకి వెళ్తున్నారు. తన పర్యటనలో ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. రానున్న ఎన్నికల్లో ఇరు పార్టీల మధ్య సహకారంపై వీరు చర్చించనున్నారు. వైసీపీకి సహకరిస్తే ఒక రాజ్యసభ సీటును బీజేపీకి ఇచ్చేందుకు జగన్ సిద్ధంగా ఉన్నట్టు చెపుతున్నారు. 

మరోవైపు ఏపీ రాజకీయాలు హీటెక్కిన సంగతి తెలిసిందే. వైఎస్ షర్మిల రాకతో రాజకీయాలు మరింత రంజుగా మారాయి. షర్మిల నేరుగా తననే టార్గెట్ చేస్తుండటం జగన్ కు ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో బీజేపీ పెద్దలను కలిసేందుకు ఆయన ఢిల్లీకి వెళ్తున్నారని సమాచారం.
Advertisement
Jagan
YSRCP
Delhi
Amit Shah
AP Politics
YS Sharmila
Congress

More Telugu News