దావోస్‌లో 'ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ' ప్రచారాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి

దావోస్‌లో జరుగుతోన్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 'ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ' ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సదస్సుకు రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ పోరమ్ 54వ వార్షిక సదస్సు మూడురోజుల పాటు జరగనుంది. దావోస్‌లో రేవంత్ రెడ్డి బిజీబిజీగా గడుపుతున్నారు. ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. మెడ్‌ట్రానిక్ సీఈవో జియోఫ్ మార్తా, అపోలో హాస్పిటల్ ప్రీతారెడ్డితో ఆయన సమావేశమయ్యారు.


More Telugu News