గుర్రపు స్వారీ చేస్తూ వెళ్లి ఆర్డర్ డెలివరీ.. వీడియో ఇదిగో!
- పెట్రోల్ దొరకక పోవడంతో గుర్రమెక్కిన జొమాటో బాయ్
- హైదరాబాద్ లో ఘటన.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
- సిటీలో పెట్రోల్ బంకుల వద్ద భారీగా వాహనాల క్యూ
గుర్రపు స్వారీ చేస్తూ వెళుతున్న డెలివరీ బాయ్ ను వాహనదారులు పలకరించి ఏం జరిగిందంటూ విచారించగా.. మూడు గంటల పాటు క్యూలో ఉన్నప్పటికీ పెట్రోల్ దొరకలేదంటూ సదరు డెలివరీ బాయ్ జవాబిచ్చాడు. ఆర్డర్ తీసుకున్నాక బండిలో పెట్రోల్ అయిపోయిందని, బంకు వద్ద భారీగా క్యూ ఉందని చెప్పాడు. క్యూలో ఎంతసేపు ఎదురుచూసినా పెట్రోల్ దొరకకపోవడంతో ఇలా గుర్రంపై వెళుతున్నానని చెప్పుకొచ్చాడు. ఈ ఘటనను పలువురు నెటిజన్లు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో అదికాస్తా వైరల్ గా మారింది.