డిసెంబర్ 27న శబరిమల ఆలయం మూసివేత.. డిసెంబర్ 30న పునర్దర్శనం
- డిసెంబర్ 27 రాత్రి 11.00 గంటలకు ఆలయద్వారాల మూసివేత
- మకరవిళక్కు మహోత్సవం కోసం మళ్లీ డిసెంబర్ 30న తెరుచుకోనున్న శబరిమల
- జనవరి 16న సాయంత్రం 6:36:45 గంటలకు జ్యోతి దర్శనం
- మకరవిళక్కు మహత్వష్టం తరువాత జనవరి 20న ఆలయం మూసివేత
శబరిమల ఆలయంలో 41 రోజుల పాటు మండల పూజలు జరిగాయి. డిసెంబర్ 27న మండల పూజ ముగింపు ఉత్సవం నిర్వహిస్తారు. ఆ తరువాత రాత్రి 11 గంటలకు స్వామి వారి ఆలయాన్ని మూసేస్తారు. మండల పూజల ముగింపు తరువాత మకరజ్యోతి ఉత్సవాలు నిర్వహిస్తారు. డిసెంబర్ 30న సాయంత్రం 5 గంటలకు ఉత్సవాల కోసం శబరిమల సన్నిధానాన్ని తెరుస్తారు. వచ్చే ఏడాది జనవరి 15న మకరవిళక్కు పూజలు నిర్వహిస్తారు. కాగా, మకరవిళక్కు పూజలకు భక్తులు ఆలయానికి పోటెత్తే అవకాశం ఉండటంతో అధికారులు ఇందుకు తగిన ఏర్పాట్లు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.