లోకేశ్ కు క్రిస్మస్ కానుకలు పంపిన షర్మిల.... ఫొటోలు ఇవిగో!
- రేపు క్రిస్మస్ పండుగ
- నారా లోకేశ్ కు ఊహించని వ్యక్తి నుంచి కానుకలు
- ముగ్ధుడైన నారా లోకేశ్
- షర్మిలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపిన వైనం
షర్మిల కానుకలు పంపిన విషయాన్ని నారా లోకేశ్ స్వయంగా వెల్లడించారు. అంతేకాదు, ఆమె పంపిన కానుకల పట్ల హర్షాన్ని వెలిబుచ్చారు.
"ప్రియమైన షర్మిల గారూ... మీరు పంపిన అద్భుతమైన క్రిస్మస్ కానుకలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మీకు, మీ కుటుంబానికి ఈ క్రిస్మస్ తో పాటు, నూతన సంవత్సరాది కూడా సంతోషకరంగా సాగిపోవాలని నారా కుటుంబం శుభాకాంక్షలు తెలుపుతోంది" అంటూ లోకేశ్ బదులిచ్చారు.

