Advertisement

కరెంట్‌ను బీఆర్ఎస్ నేతలే కనుకొన్నట్లుగా మాట్లాడుతున్నారు: బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విసుర్లు

BJP MLA Payal Shankar fires at BRS leaders
  • బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ముందు అసలు విద్యుత్ లేనట్లుగానే చెప్పడం విడ్డూరమని వ్యాఖ్య
  • శ్వేతపత్రాలు ఆరంభంలోనే ఉంటాయని తాము ఊహించలేదన్న పాయల్ శంకర్
  • ఏపీలో మోటార్లకు మీటర్లు పెట్టినా... ఉచిత విద్యుత్ ఇస్తోందని స్పష్టీకరణ
కరెంట్‌ను బీఆర్ఎస్ నేతలే కనుకొన్నట్లుగా మాట్లాడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అసెంబ్లీలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ముందు విద్యుత్ లేనట్లుగానే చెప్పడం విడ్డూరమన్నారు. ఇలాంటి శ్వేతపత్రాలు ఆరంభంలోనే ఉంటాయని తాము ఊహించలేదన్నారు. విద్యుత్ వ్యవస్థ మెరుగ్గా ఉండాల్సిందేనని ఆయన అన్నారు. ఏపీలో మోటార్లకు మీటర్లు పెట్టినా... ఉచిత విద్యుత్ ఇస్తోందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించిందని, అది ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పాలి? అని ప్రశ్నించారు.
Advertisement
BJP
BRS
Congress
payal shankar

More Telugu News