Mahesh Babu: రేవంత్ రెడ్డికి మహేశ్ బాబు, రామ్ చరణ్ శుభాకాంక్షలు

Mahesh Babu and Ram Charan greetings to Revanth Reddy
  • టీఎస్ సీఎం రేవంత్ కు సినీ ప్రముఖుల అభినందనలు
  • రాష్ట్రాన్ని అభివృద్ధి శిఖరాల వైపు తీసుకెళ్లాలన్న మహేశ్ బాబు
  • రాష్ట్రంలో సానుకూల మార్పులు వస్తాయని భావిస్తున్నానన్న చరణ్
తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన రేవంత్ రెడ్డికి సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చిరంజీవి, పవన్ కల్యాణ్, నిఖిల్, రామ్ గోపాల్ వర్మ తదితరులు ఇప్పటికే అభినందనలు తెలిపారు. తాజాగా మహేశ్ బాబు, రామ్ చరణ్ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రాన్ని విజయం, శ్రేయస్సు, అభివృద్ధి శిఖరాల వైపు తీసుకెళ్లాలని మహేశ్ బాబు ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన రేవంత్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని రామ్ చరణ్ అన్నారు. మీ నాయకత్వంలో రాష్ట్రంలో సానుకూల మార్పులు వస్తాయని భావిస్తున్నానని ట్వీట్ చేశారు.

More Telugu News

Mahesh Babu
Ramcharan
toll
Revanth Reddy
Congress