పవన్ పై పేర్ని నాని మరోసారి ఘాటు విమర్శలు
- డబ్బులు లేని పవన్ ప్రత్యేక విమానాల్లో ఎలా వస్తారన్న పేర్ని నాని
- జగన్ పై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని మండిపాటు
- కాపులను పవన్ ఏనాడైనా మనుషులుగా చూశారా అని విమర్శ
2014 నుంచి 2019 వరకు చంద్రబాబు, మీరు కలిసి ఒక్క ఫిషింగ్ హార్బర్ అయినా కట్టారా? అని పేర్ని నాని ప్రశ్నించారు. కాపులను పవన్ ఏనాడైనా మనుషులుగా చూశారా? అని అడిగారు. ఓట్ల కోసం చంద్రబాబు, పవన్ మాయ చేస్తున్నారని విమర్శించారు. బేగంపేటలో విమానాన్ని ఆపేయించారని పవన్ అంటున్నారని... విమానం ఆపితే ఎలా వచ్చారని ప్రశ్నించారు.