చిత్రపటాన్ని పట్టుకుని రోడ్డుపై నిలబడిన చిన్నారి.. బస్సు ఆపి పలకరించిన కేసీఆర్
- జగిత్యాలలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్
- తిరిగి వెళుతుండగా కేసీఆర్ చిత్రపటాన్ని పట్టుకుని రోడ్డుపై నిలబడిన చిన్నారి
- బస్సును ఆపమని సంజ్ఞ చేసి, చిన్నారిని పలకరించిన కేసీఆర్
చిన్నారిని చూసిన కేసీఆర్, డ్రైవర్‌తో బస్సు ఆపమంటూ చేయితో సంజ్ఞ చేశారు. ఆమె చేతిలోని చిత్రపటాన్ని తీసుకురావాలని తన వద్ద ఉన్నవారిని పురమాయించారు. తన ఫొటోను చూసి ముచ్చటపడిన కేసీఆర్, బస్సు వెలుపల అద్దంలో నుంచి చూస్తున్న పాపను ఆప్యాయంగా పలకరించారు.