'రాజా శివాజీ'.. భర్త ఎమోషనల్ స్పీచ్, కంటతడిపెట్టిన జెనీలియా
- 'రాజా శివాజీ' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో దంపతుల భావోద్వేగం
- భార్య సహకారం, తండ్రిని గుర్తు చేసుకుంటూ రితేశ్ భావోద్వేగం
- మే 1వ తేదీన విడుదల కానున్న సినిమా
'రాజా శివాజీ' చిత్రానికి తాను పడిన కష్టాన్ని, భార్య జెనీలియా అందించిన సహకారాన్ని, తన తండ్రిని తలుచుకుంటూ సినీ నటుడు రితేష్ దేశ్ముఖ్ ఎమోషనల్ అయ్యారు. ఆయన పక్కనే ఉన్న జెనీలియా ఆ మాటలకు భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్నారు. 'రాజా శివాజీ' చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమంలో వీరిద్దరు భావోద్వేగానికి గురయ్యారు. ఇద్దరూ భావోద్వేగానికి గురికావడంతో అక్కడ కాసేపు గంభీరమైన వాతావరణం కనిపించింది.
ఛత్రపతి శివాజీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా 'రాజా శివాజీ'. ఇది తన డ్రీమ్ ప్రాజెక్టు కావడంతో రితేష్ దేశ్ముఖ్ టైటిల్ పాత్ర పోషిస్తూ, దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో జెనీలియా కూడా నటించారు. సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్, విద్యాబాలన్ తదితర ప్రముఖులు కీలక పాత్రల్లో నటించారు. మే 1న విడుదల ఈ సినిమా విడుదల కానుంది.