తమిళనాడులో చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి అద్భుత స్పందన... ఫొటోలు చూడండి!
- తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- పుట్టినరోజున కృష్ణగిరి జిల్లా తళ్లిలో భారీ బహిరంగ సభ
- డబుల్ ఇంజిన్ సర్కారుతోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టీకరణ
- ఎన్డీయే కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపు
- అధికార డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు
తళ్లిలో నిర్వహించిన బహిరంగ సభకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. జనం భారీగా తరలిరావడంతో చంద్రబాబు ఉత్సాహంగా ప్రసంగించారు. చంద్రబాబు పుట్టినరోజు కావడంతో కొందరు అభిమానులు, కార్యకర్తలు 'హ్యాపీ బర్త్ డే సీబీఎన్ సర్' అనే ప్లకార్డులు ప్రదర్శించి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తమిళనాడులో మార్పు రావాలంటే ఎన్డీయే కూటమి అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే కూటమి ప్రభుత్వం ఉంటే అభివృద్ధి వేగవంతం అవుతుందని తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అభివృద్ధి డబుల్ ఇంజిన్ సర్కారు వల్లే సాధ్యమైందని ఆయన ఉదాహరించారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు రెండు రోజుల పర్యటన చేపట్టారు. ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుండగా, 21వ తేదీతో ప్రచారం ముగియనుంది. తన పర్యటనలో భాగంగా ఆయన మంగళవారం మధురై, సాతూర్ ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు.










