జర్మనీలో ఘనంగా చంద్రబాబు 76వ పుట్టినరోజు వేడుకలు
- జర్మనీలోని పలు నగరాల్లో ఘనంగా చంద్రబాబు 76వ జన్మదిన వేడుకలు
- కేక్ కట్ చేసి, చంద్రబాబు రాజకీయ ప్రస్థానంపై వీడియో ప్రదర్శన
- అమరావతికి చట్టబద్ధత తేవడంలో చంద్రబాబు కృషిని కొనియాడిన వక్తలు
- చంద్రబాబుపై రాసిన పుస్తకానికి జర్మన్, ఫ్రెంచ్ అనువాద ప్రతుల పంపిణీ
- ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి భారీగా హాజరైన ప్రవాస భారతీయులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు 76వ పుట్టినరోజు వేడుకలను జర్మనీలో నివసిస్తున్న ప్రవాసాంధ్రులు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఫ్రాంక్‌ఫర్ట్, హాంబర్గ్, మాన్‌హైమ్ నగరాల్లో స్థానిక తెలుగు సంఘాలు, ఎన్ఆర్ఐ టీడీపీ జర్మనీ విభాగం సంయుక్తంగా ఈ కార్యక్రమాలను చేపట్టాయి. ఈ వేడుకల్లో ప్రవాస తెలుగువారు పెద్ద సంఖ్యలో కుటుంబాలతో సహా పాల్గొని, తమ అభిమాన నాయకుడిపై ఉన్న ప్రేమను చాటుకున్నారు.
హాంబర్గ్‌లో జరిగిన కార్యక్రమం మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతాలాపన, జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైంది. అనంతరం, చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేశారు. ఆయన నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానం, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై రూపొందించిన ప్రత్యేక వీడియోను ప్రదర్శించారు. ఈ కార్యక్రమాలను ఎన్ఆర్ఐ టీడీపీ జర్మనీ ప్రతినిధులు పవన్ కుర్రా, శ్రీకాంత్ కుడితిపూడి, సుమంత్ కొర్రపాటి, టిట్టు మద్దిపట్ల సమన్వయం చేశారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, చంద్రబాబు నాయకత్వ పటిమను, దార్శనికతను కొనియాడారు. ముఖ్యంగా, అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా గుర్తించేలా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చట్టం తీసుకురావడంలో చంద్రబాబు పోషించిన కీలక పాత్రను గుర్తుచేశారు. జాతీయ స్థాయిలో ఆయనకున్న విశ్వసనీయత వల్లే వైసీపీ మినహా అన్ని పార్టీలు ఏకగ్రీవంగా బిల్లుకు మద్దతిచ్చాయని అన్నారు. ఈ చారిత్రక ఘట్టానికి సహకరించిన ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
చంద్రబాబు తన పాలనతో అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచారని, ఐటీ రంగ విస్తరణ, పెట్టుబడుల ఆకర్షణలో ఆయనకు సాటిలేరని ప్రశంసించారు. సంక్షోభాన్ని సైతం అవకాశంగా మలుచుకుంటూ, నవ్యాంధ్రప్రదేశ్‌ను శిథిలాల నుంచి శిఖరాల వైపు నడిపిస్తున్నారని వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ వేడుకల్లో భాగంగా, సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ ప్రసాద్ రచించిన "చంద్రబాబు నాయుడు X.0" పుస్తకం జర్మన్, ఫ్రెంచ్ అనువాద ప్రతులను పంపిణీ చేశారు. ఈ పుస్తకాలను జర్మనీలోని ప్రధాన గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంచేందుకు కృషి చేస్తున్నట్లు టిట్టు మద్దిపట్ల, శివశంకర్ లింగం తెలిపారు.
76వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా బెలూన్లు ఎగురవేసి పండుగ వాతావరణంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో హాంబర్గ్, బ్రౌన్‌చ్‌వైగ్, హిల్దిస్‌హైం, బ్రెమెన్ నగరాల నుంచి టీడీపీ ప్రతినిధులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమం చివరగా తెలుగు సంప్రదాయ రుచులతో కూడిన విందు భోజనం ఏర్పాటు చేశారు.