పనిమనిషి కూతురు కోసం తల్లడిల్లిన సన్నీలియోన్
Add ap7am to your home Screen

పనిమనిషి కూతురు కోసం తల్లడిల్లిన సన్నీలియోన్

Sunny Leone desperation for maids daughter
  • 8వ తేదీన మిస్ అయిన సన్నీ పనిమనిషి కూతురు
  • అమ్మాయిని వెతికి తీసుకొచ్చిన వారికి రూ. 50 వేల బహుమతి ఇస్తానన్న సన్నీ
  • అమ్మాయి దొరికిందంటూ మరో పోస్ట్ చేసిన సన్నీ
బాలీవుడ్ నటి సన్నీ లియోన్ మానవత్వం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అనాథ పిల్లలను దత్తత తీసుకుని సొంత బిడ్డల్లా ఆమె చూసుకుంటున్న సంగతి తెలిసిందే. మరోవైపు తాజాగా ఆమె పని మనిషి కూతురు అనుష్క మిస్ అయింది. దీంతో సన్నీ తల్లడిల్లిపోయింది. ఆమెను వెతకడంలో సాయం చేయాలని కోరుతూ సోషల్ మీడియా వేదికగా కోరింది. తొమ్మిదేళ్ల వయసున్న అనుష్క ఈ నెల 8న జోగేశ్వరి బెహ్రామ్ బాగ్ లో తప్పిపోయిందని... ఆ పాప తల్లిదండ్రుల ఆవేదన చూస్తుంటే ఎంతో బాధ కలుగుతోందని చెప్పింది. ఆమెను వెతికి తీసుకొచ్చిన వారికి రూ. 50 వేల బహుమతిని ఇస్తానని ప్రకటించింది. ఈ మెసేజ్ ను ముంబై పోలీసులకు కూడా ట్యాగ్ చేసింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

మరోవైపు... తప్పిపోయిన చిన్నారి అనుష్క దొరికింది. ఈ విషయాన్ని సన్నీ లియోన్ ప్రకటించింది. పాప దొరికింది అంటూ ఆమె మరో పోస్ట్ చేసింది. ఆ కుటుంబానికి భగవంతుని ఆశీస్సులు ఉన్నాయని తెలిపింది. ముంబై పోలీసులుకు ధన్యవాదాలు తెలియజేసింది. 24 గంటల్లోనే అనుష్క దొరికిందని.. ఆమె కోసం తాను పెట్టిన పోస్ట్ ను షేర్ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. కాగా, పనిమనిషి కూతురు కోసం సన్నీ పడిన తపనను చూసిన నెటిజెన్లు ఆమెను ప్రశంసిస్తూ మెసేజ్ లు పెడుతున్నారు.
Advertisement
Sunny Leone
Bollywood

More Telugu News