ఆఫ్ఘన్ క్యాంప్ లో సచిన్ సందడి... ఫొటోలు ఇవిగో!
- రేపు ముంబయిలో ఆస్ట్రేలియా × ఆఫ్ఘనిస్థాన్
- ముంబయిలో సాధన చేస్తున్న ఆఫ్ఘన్ ఆటగాళ్లు
- స్టేడియానికి వెళ్లి ఆఫ్ఘన్ ఆటగాళ్లను కలిసిన సచిన్
ఈ క్రమంలో ఆఫ్ఘన్ శిబిరాన్ని సచిన్ సందర్శించాడు. ఆఫ్ఘన్ ఆటగాళ్లతో కలిసి ఉత్సాహంగా ముచ్చటించాడు. వారిని పేరుపేరునా పలకరించి ఉత్తేజం నింపాడు. అంతేకాదు, ఆఫ్ఘనిస్థాన్ జట్టు కోచ్ జోనాథన్ ట్రాట్, సలహాదారు అజయ్ జడేజాలతోనూ సచిన్ ఉల్లాసంగా మాట్లాడుతూ కనిపించాడు.
వరల్డ్ కప్ టోర్నీలో ఆఫ్ఘనిస్థాన్ 7 మ్యాచ్ లు ఆడి 4 విజయాలు సాధించింది. సెమీస్ అవకాశాలు ఊరిస్తుండడంతో ఆ జట్టు ఉత్సాహంగా ఉంది. అయితే, రేపు ఆసీస్ తో, ఈ నెల 10న దక్షిణాఫ్రికాతో ఆడాల్సి ఉండడం ఆ జట్టుకు ప్రతికూలం కానుంది. ఎందుకంటే, ఆసీస్, దక్షిణాఫ్రికా వంటి బలమైన జట్లను కంగు తినిపించడం ఏమంత సులువు కాదు.


