గుడివాడ అంటే ఆయనకు ఎంతో మమకారం: కొడాలి నాని
- గుడివాడలో కైకాల సత్యనారాయణ విగ్రహానికి భూమి పూజ
- గుడివాడ అభివృద్ధికి సత్యనారాయణ ఎంతో చేశారన్న కొడాలి నాని
- ఆయనతో తనకు మంచి అనుబంధం ఉందని వెల్లడి
గుడివాడ పాత మున్సిపల్ కార్యాలయం సెంటర్లో సత్యనారాయణ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఉదయం భూమి పూజను నిర్వహించి నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమం కొడాలి నాని చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ విగ్రహ ఏర్పాటు ద్వారా సత్యనారాయణ కలకాలం జీవించే ఉంటారని చెప్పారు.