15 వేల ప్రమోషన్లు ఇచ్చాం.. ఇంకా ధర్నాలెందుకు?: సచివాలయ ఉద్యోగుల డిమాండ్లపై మంత్రి స్వామి
- ఉద్యోగులను వైఎస్ జగన్ రెచ్చగొడుతున్నారని మంత్రి స్వామి ఆరోపణ
- అక్రమ ధర్నాలు, ఒత్తిళ్లు సహించేది లేదని హెచ్చరిక
- నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టీకరణ
- రెండు క్యాజువల్ లీవులకు ఉన్నతాధికారుల అనుమతి అవసరం లేదన్న మంత్రి
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇప్పటికే 15 వేల మందికి పైగా ప్రమోషన్లు ఇచ్చామని, సమస్యలు పరిష్కరిస్తున్న ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని రాష్ట్ర మంత్రి డీఎస్‌బీవీ స్వామి స్పష్టం చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు అక్రమంగా ధర్నాలు చేస్తే సహించేది లేదని ఆయన గట్టిగా హెచ్చరించారు.
సోమవారం అమరావతిలో మంత్రి స్వామి మీడియాతో మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగుల ఆందోళనలపై ప్రభుత్వ వైఖరిని వెల్లడించారు. గత ప్రభుత్వం సరైన సర్వీస్ రూల్స్ లేకుండా నోటిఫికేషన్లు ఇచ్చిందని, తమ ప్రభుత్వం వాటిని సరిదిద్దిందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో సచివాలయ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించినట్లు వివరించారు. దీనిలో భాగంగా రెండు క్యాజువల్ లీవులను ఉన్నతాధికారుల అనుమతి లేకుండా వాడుకునే వెసులుబాటు కూడా కల్పించామని చెప్పారు.
ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనల వెనుక ఎవరున్నారనే దానిపై విచారణ జరుపుతామని చెబుతూనే, ఈ ఆందోళనలకు జగనే కారణమని మంత్రి స్వామి ఆరోపించారు. "గతంలో రూ.15,000 జీతానికి రెండేళ్లు పనిచేసినప్పుడు నిరసన తెలపని వారు, ఇప్పుడు ఎందుకు ఆందోళన చేస్తున్నారని ప్రశ్నించారు. గత పీఆర్సీలో వీరిని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు?" అని నిలదీశారు.
కొన్ని డిమాండ్లపై మంత్రి స్పష్టత ఇచ్చారు. నోషనల్ ఇంక్రిమెంట్లు ఎవరికీ ఇవ్వడం సాధ్యం కాదని, కాబట్టి సచివాలయ ఉద్యోగులకు కూడా ఇవ్వలేమని తేల్చిచెప్పారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగానే చూస్తున్నామని, గత ప్రభుత్వం నియమించిందన్న వివక్ష తమకు లేదని అన్నారు. వారి కోసం ప్రత్యేకంగా ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేసిందే తమ ప్రభుత్వమని గుర్తుచేశారు. వారి సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని, అయితే ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.