జ్యోతిక కోసం సూర్య నాలుగేళ్లు ఎదురుచూశాడు.. ఆమె 18 ఏళ్లు మాతోనే ఉంది: శివకుమార్
- కోడలు జ్యోతికపై ప్రశంసలు కురిపించిన మామ శివకుమార్
- పెళ్లి తర్వాత 18 ఏళ్లు తమ కుటుంబంతోనే జ్యోతిక ఉందని వెల్లడి
- ఒక నటీనటుల జంట 20 ఏళ్లు సంతోషంగా ఉండటం అరుదని వ్యాఖ్య
సీనియర్ నటుడు శివకుమార్ తన కుమారుడు సూర్య, కోడలు జ్యోతికల బంధం గురించి ఎంతో ఆనందంగా మాట్లాడారు. పెళ్లి తర్వాత 18 ఏళ్ల పాటు జ్యోతిక తమ కుటుంబంతోనే కలిసి ఉండిపోయిందని ఆయన ప్రశంసించారు. ఇటీవల జరిగిన 'జేఎఫ్‌డబ్ల్యూ ఫేవరెట్స్ అవార్డ్స్ 2026' కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ.. "కనిపించిన ప్రతి అమ్మాయిని ప్రేమించలేం అని సూర్య ఒకప్పుడు వాళ్ల అమ్మతో చెప్పేవాడు. ఆ తర్వాత ముంబైకి చెందిన జ్యోతికతో ప్రేమలో పడ్డాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలనే నిశ్చయంతో నాలుగేళ్ల పాటు ఎదురుచూశాడు" అని నాటి విషయాలను గుర్తుచేసుకున్నారు.
పెళ్లి తర్వాత జ్యోతిక ముంబైకి వెళ్లకుండా, తమతోనే చెన్నైలో ఉండిపోవాలని తీసుకున్న నిర్ణయాన్ని శివకుమార్ ప్రత్యేకంగా కొనియాడారు. "ఆమె ఇక్కడే 18 సంవత్సరాలు ఉంది. మాతో కలిసి జీవిస్తూనే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది" అని ఆయన వివరించారు.
ఇటీవలే సూర్య, జ్యోతిక తమ 20వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకొని, మరోసారి వివాహ ప్రమాణాలు చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వారి పిల్లలు విదేశాల్లో చదువుకుంటున్నారు. ఒక నటీనటుల జంట 20 ఏళ్ల పాటు అవే ప్రేమ, అనురాగాలతో సంతోషంగా జీవించడం చాలా అరుదని ఈ సందర్భంగా శివకుమార్ అభిప్రాయపడ్డారు.