రకుల్ ప్రీత్ సింగ్‌కు ఐటీ షాక్.. ఇల్లు, ఆఫీసుల్లో అధికారుల సోదాలు
- నటి రకుల్ ప్రీత్ సింగ్‌పై ఆదాయపు పన్ను శాఖ దాడులు
- ఆమె మామ, నిర్మాత వషు భగ్నాని కార్యాలయాల్లోనూ సోదాలు
- ముంబైలో మొత్తం 12 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు
- సినిమా ఫైనాన్సింగ్ పేరుతో నిధుల మళ్లింపుపై ఆరోపణలు
- కీలక పత్రాలు, రికార్డులను పరిశీలిస్తున్న అధికారులు
ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్‌కు ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు షాక్ ఇచ్చారు. ముంబైలోని ఆమె నివాసంతో పాటు పలు కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రకుల్‌తో పాటు ఆమె మామ, ప్రముఖ సినీ నిర్మాత వషు భగ్నాని, పనోరమా స్టూడియోస్‌కు సంబంధించిన ప్రాంతాల్లో కూడా ఏకకాలంలో తనిఖీలు జరుగుతున్నాయి.
ముంబై ఐటీ విభాగానికి చెందిన అధికారులు మొత్తం 12 ప్రాంతాల్లో ఈ సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. సినిమా ప్రాజెక్టుల ఫైనాన్సింగ్ ముసుగులో విదేశాలకు అక్రమంగా నిధులు మళ్లించారన్న అనుమానాలతో ఈ దాడులు జరుగుతున్నట్లు సమాచారం. అనుమానాస్పద నిధుల లావాదేవీలకు సంబంధించి ఐటీ అధికారులకు పక్కా సమాచారం అందినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం పలు బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు.. కీలక పత్రాలు, ఆర్థిక రికార్డులు, విదేశీ లావాదేవీలకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ సోదాల నేపథ్యంలో బాలీవుడ్‌లో కలకలం రేగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.