ములాఖత్‌లో చంద్రబాబుకు వివిధ అంశాలను వివరించిన లోకేశ్
- జనసేనతో నిర్వహించనున్న సమన్వయ కమిటీ సమావేశం అంశం వివరించిన తనయుడు
- కరవు, కృష్ణా జలాల పంపిణీ పునఃసమీక్ష అంశాలనూ వివరించిన లోకేశ్
- పెరుగుతున్న నిత్యావసర ధరలు, విద్యుత్ ఛార్జీల పెంపుపై దృష్టి సారించాలని లోకేశ్‌కు చంద్రబాబు సూచన
దసరా సందర్భంగా ప్రజలను ఉద్దేశించి జైలు నుంచి విడుదల చేసిన లేఖపై వైసీపీ రాజకీయం చేస్తోందని కూడా చంద్రబాబుకు లోకేశ్ చెప్పారట. ఈ సందర్భంగా... నిత్యావసర ధరలు, విద్యుత్ ఛార్జీల పెంపు వంటి అంశాలపై దృష్టి సారించి, ప్రజల్లోకి వెళ్లాలని లోకేశ్‌కు చంద్రబాబు సూచించినట్లు సమాచారం. కాగా, ములాఖత్ అనంతరం లోకేశ్ పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు.