వీళ్లు మనిషి జన్మ ఎత్తలేదు: పేర్ని నాని

Perni Nani slams Bandaru Satyanarayana and Ayyanna
  • టీడీపీ నేతలు, బండారుపై పేర్ని నాని ఫైర్
  • విలువలు, వ్యక్తిత్వం లేని నాయకులు అంటూ విమర్శలు
  • ఇటువంటి వాళ్ల గురించి మాట్లాడడం అనవసరమని వ్యాఖ్య  
వైసీపీ ఎమ్మెల్యే, మాజీమంత్రి పేర్ని నాని టీడీపీ నేతలపై ధ్వజమెత్తారు. బండారు సత్యనారాయణమూర్తి-రోజా ఉదంతంపై పేర్ని నాని స్పందించారు. 

టీడీపీలో బండారు సత్యనారాయణ, అయ్యన్నపాత్రుడు, ఇంకొందరు నేతలు ఉన్నారని... వీళ్లు మనిషి జన్మ ఎత్తారు అనలేమని ఘాటుగా విమర్శించారు. ఛీ... మా కడుపున ఇలాంటి వెధవలు పుట్టారు అని వాళ్ల తల్లిదండ్రుల ఆత్మలు క్షోభిస్తాయని అన్నారు. వీళ్లకు విలువలు, వ్యక్తిత్వం అంటూ ఏమీ లేదని, ఇలాంటి వాళ్ల గురించి మనం చర్చించుకోవడం కూడా అనవసరమేనని పేర్ని నాని పేర్కొన్నారు. 

ఇక, ఇటీవల కాలంలో నారా బ్రాహ్మణి ఏపీ ప్రభుత్వంపై చేస్తున్న ట్వీట్లపైనా పేర్ని నాని స్పందించారు. ఆమె తన అత్తామామలపై ట్వీట్లు చేయబోయి ప్రభుత్వంపై చేసిందేమోనని వ్యాఖ్యానించారు. వాళ్ల అత్తాకోడళ్ల మధ్య కూడా ఏమైనా తగాదాలు ఉన్నాయేమో ఎవరికి తెలుసు అని పేర్కొన్నారు.
Go Back to Shorts
Perni Nani
Bandaru Satyanarayana Murthy
Ayyanna Patrudu
Roja
Nara Brahmani
YSRCP
TDP

More Telugu News