పవన్ కల్యాణ్ ప్రభావం ఏమాత్రం ఉండదు: మంత్రి ఉషశ్రీ చరణ్
- పవన్ కల్యాణ్ ఎప్పుడూ టీడీపీతోనే ఉన్నారన్న మంత్రి
- 2024లో 175 స్థానాలు వైసీపీయే గెలుస్తుందన్న ఉషశ్రీ చరణ్
- రోజాపై బండారు సత్యనారాయణమూర్తి వ్యాఖ్యలను ఖండించిన మంత్రి
ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కల్యాణ్ ప్రభావం, వారాహి యాత్ర ప్రభావం ఏమాత్రం ఉండదని జోస్యం చెప్పారు. డైవర్షన్ పాలిటిక్స్ టీడీపీకి అలవాటే అన్నారు. 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో 175 స్థానాలకు గాను అన్నింటా తామే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. జగన్ రెండోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. టీడీపీ, జనసేనతో పాటు మరెన్ని పార్టీలు కలిసి వచ్చినా వైసీపీయే గెలుస్తుందన్నారు.