చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ ప్రత్యేక గీతం విడుదల
- పాటను రచించి, రూపొందించిన గుమ్మడి గోపాలకృష్ణ
- కన్నీళ్లు కాదు కాదు.. కళ్లు ఎరుపెక్కాలి, అంతు తేల్చుకోవాలి అనే పల్లవితో సాగే గీతం
- చంద్రబాబు అరెస్ట్ అక్రమమని సాగే గీతం
ఈ గీతాన్ని బాగా రాశారని గోపాలకృష్ణను అచ్చెన్నాయుడు ప్రశంసించారు. ఆయనకు శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు దేవినేని ఉమా మహేశ్వరరావు, వర్ల రామయ్య, పట్టాభిరాం, మాజీ ఎమ్మెల్యే సునీల్, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ, కౌన్సిల్ మాజీ చైర్మన్ షరీఫ్, ఎమ్మెల్సీ అశోక్ బాబు పాల్గొన్నారు.