బాధ్యతారహితంగా మాట్లాడితే పర్యవసానాలు ఉంటాయి: పవన్ వ్యాఖ్యలపై ఎస్పీ జాషువా స్పందన
- పెడన సభలో రాళ్లదాడి చేయించేందుకు వైసీపీ ప్లాన్ వేసిందన్న పవన్
- నోటీసులకు పవన్ రిప్లై ఇవ్వలేదన్న ఎస్పీ జాషువా
- ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని సూచన
ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా మాట్లాడుతూ... తమ నోటీసుకు పవన్ నుంచి రిప్లై రాలేదని చెప్పారు. పెడనలోని తోటమూల సెంటర్ లో బహిరంగసభకు పవన్ అనుమతి కోసం పవన్ దరఖాస్తు చేసుకున్నారని, ఆయన సభకు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశామని వెల్లడించారు. పవన్ చేసిన ఆరోపణల్లో నిజం ఉంటే తాము చర్యలు తీసుకుంటామని చెప్పారు. సరైన ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. బాధ్యతారహితంగా ఆరోపణలు చేస్తే పర్యవసానాలు ఉంటాయని హెచ్చరించారు.