కాన్వాయ్‌ని అడ్డుకున్న టీడీపీ శ్రేణులు.. దారి ఇవ్వాలని కోరిన చంద్రబాబు
- చిలకలూరిపేటలో చంద్రబాబును తీసుకెళ్తున్న కాన్వాయ్‌ని అడ్డుకున్న టీడీపీ శ్రేణులు
- దాదాపు అరగంట పాటు నిలిచిన కాన్వాయ్
- రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన టీడీపీ శ్రేణులు
- దారి ఇవ్వాలని అధినేత కోరడంతో ముందుకు కదిలిన వాహనం
ఈ క్రమంలో టీడీపీ అధినేత వాహనం నుండి దిగి దారి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ టీడీపీ శ్రేణులు నిరసనను ఆపలేదు. చంద్రబాబు ఒకటికి రెండుసార్లు దారి ఇవ్వాలని కోరడంతో తప్పుకున్నారు. దీంతో కాన్వాయ్ ముందుకు కదిలింది. కాన్వాయ్‌ని ఎక్కడికి అక్కడ టీడీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా, టీడీపీ కార్యకర్తలపై, మీడియా ప్రతినిధులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.