రామోజీరావుపై వైసీపీ చేసిన దాడులను ఖండిస్తున్నా: చంద్రబాబు
- మీడియాను కూల్చేందుకు జగన్ యత్నిస్తున్నారన్న చంద్రబాబు
- సొంత వైఫల్యాలు, ప్రజల్లో వ్యతిరేకతతో జగన్ నిరాశలో కూరుకుపోయాడని వ్యాఖ్య
- మార్గదర్శి ఖ్యాతి దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారని మండిపాటు
జర్నలిజం, సాహిత్యం, విద్యా రంగాల్లో చేసిన సేవలకు గాను రామోజీరావును దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ తో భారత ప్రభుత్వం సత్కరించిందని... ఎంతో ఉన్నత విలువలు కలిగిన రామోజీరావుపై వైసీపీ చేసిన దాడులను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని చంద్రబాబు అన్నారు. జగన్ ఎన్ని దుష్ట ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండదని... ఎందుకంటే చెడు ఎప్పుడూ ఓడిపోతుందని, మంచి ఎప్పుడూ గెలుపొందుతుంటుందని చెప్పారు.