మరో డిక్లరేషన్‌కు రెడీ అయిన టీ కాంగ్రెస్.. ఖర్గేతో నేతల కీలక భేటీ
- ఈ నెల 26న చేవెళ్లలో కాంగ్రెస్ బహిరంగ సభ
- ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించనున్న పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే
- పార్టీ మార్పుపై పుకార్లను ఖండించిన ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి
అన్ని విషయాలను క్రోడీకరించి చేవెళ్ల సభలో ఖర్గే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటిస్తారన్నారు. మరోవైపు పార్టీ మార్పుపై వస్తున్న ప్రచారాన్ని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. గత కొన్ని రోజులుగా తాను, తన భార్య పార్టీని వీడుతున్నామని వదంతులు, దుష్ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఏఐసీసీ, పీసీసీ ఎన్నికల కమిటీ ఆమోదంతో హుజూర్‌నగర్ నియోజకవర్గం నుంచి తాను, కోదాడ నుంచి పద్మావతి రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలిపారు.