విధులకు రేవంత్ రెడ్డి సెక్యూరిటీ సిబ్బంది డుమ్మా?
- ఇటీవల పోలీసులపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సెక్యూరిటీ సిబ్బంది గైర్హాజరు
- రెండు రోజులుగా విధులకు సెక్యూరిటీ గైర్హాజరు
- రేవంత్ రెడ్డికి ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలన్న కాంగ్రెస్ వర్గాలు
రేవంత్ రెడ్డి రెండు నెలల క్రితమే తనకు సెక్యూరిటీ కావాలని కోర్టును ఆశ్రయించారు. తొలుత 4 ప్లస్ 4 గన్ మెన్ ఉండగా, ఇటీవల ప్రభుత్వం దానిని 2 ప్లస్ 2కు కుదించింది. తాజాగా, నిన్నటి నుండి మిగిలిన సెక్యూరిటీ సిబ్బంది కూడా గైర్హాజరైంది.