Advertisement

‘కశ్మీర్ ఫైల్స్’ నటి అదా శర్మకు అనారోగ్యం..ఆసుపత్రిలో చేరిక

Adah Sharma Hospitalised Due To Food Allergy
  • ఫుడ్‌ అలర్జీతో ఆసుపత్రి పాలైన అదా శర్మ
  • ఒంటిపై దద్దుర్లు, డయేరియాతో అదా ఇబ్బంది పడుతున్నట్టు ఆమె ప్రతినిధి వెల్లడి
  • అదా నటించిన కమాండో ఆగస్టు 11న ఓటీటీలో విడుదల
‘కశ్మీర్ ఫైల్స్’ మూవీతో దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న అదా శర్మ అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు. ఫుడ్ అలర్జీ కారణంగా అదా బుధవారం ఆసుపత్రిలో చేరినట్టు ఆమె ప్రతినిధి తెలిపారు. అలర్జీ కారణంగా ఆమె ఒంటిపై దద్దుర్లు, డయేరియాతో ఇబ్బంది పడుతున్నట్టు చెప్పారు. అదా తన తదుపరి చిత్రం ‘కమాండో’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉండగా అనారోగ్యం పాలయ్యారు. బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ ప్రధాన పాత్రలో కమాండో రూపుదిద్దుకుంది. ఈ చిత్రంలో భావనా రెడ్డి పాత్రను అదా శర్మ పోషించారు. ఆగస్టు  11న ఈ చిత్రం డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. 

అదా త్వరలో ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్టులో కూడా నటించనున్నారు. ఇందులో ఆమె ఓ మహిళా సూపర్ హీరో పాత్ర పోషిస్తారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గతంలో ఈ ప్రాజెక్టుపై స్పందించిన అదా తనకు చిన్నప్పటి నుంచీ ఫీమేల్ సూపర్ హీరోలు అంటే ఎంతో ఇష్టమని వెల్లడించారు. ప్రస్తుతం తనే ఇలాంటి పాత్రలో నటించడం ఎంతో ఉత్సాహంగా ఉందని చెప్పుకొచ్చారు.
Advertisement
Adah Sharma
The kerala story

More Telugu News