మృణాల్ ఠాకూర్‌‌ కు సర్‌‌ ప్రైజ్‌ ఇచ్చిన విజయ్ దేవరకొండ

Vijay Deverakonda joins VD13 team to surprise Mrunal Thakur
  • సీతారామంతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న మృణాల్
  • పరశురాం–విజయ్‌ సినిమాలో హీరోయిన్‌ గా నటిస్తున్నముద్దుగుమ్మ  
  • సెట్స్‌లో నిన్న ఆమె పుట్టిన రోజును సెలబ్రేట్‌ చేసిన చిత్ర బృందం
‘సీతారామం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన నటి మృణాల్ ఠాకూర్.  ఆ సినిమాలో ఆమె పోషించిన సీత పాత్రను టాలీవుడ్ ప్రేక్షకులు మరిచిపోలేకపోతున్నారు. ప్రస్తుతం ఆమె తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉంది. విజయ్ దేవరకొండ హీరోగా పరశురాం దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ఒకటికాగా, నానికి జంటగా ఆమె నటిస్తున్న ‘హాయ్ నాన్న’ చిత్రం మరోటి. ఇంకా టైటిల్ ఖరారు చేయని పరశురాం–విజయ్ చిత్రం షూటింగ్‌ లో ప్రస్తుతం మృణాల్ బిజీగా ఉంది. నిన్న ఆమె పుట్టినరోజు. 

దాంతో సెట్స్‌ లో చిత్ర బృందం ఆమె బర్త్ డే సెలబ్రేషన్స్ చేసింది. ఆమెతో కేక్ కట్ చేయించింది. ప్రస్తుతం వేరే షూటింగ్‌ లో పాల్గొంటున్నప్పటికీ ఈ సందర్భంగా విజయ్ కూడా సెట్స్‌ కు వచ్చి ఆమెకు సర్ ప్రైజ్ ఇచ్చాడు. హీరో, డైరెక్టర్‌‌ తో పాటు నిర్మాతలు లక్ష్మణ్, హన్షిత రెడ్డి తదితరులు కూడా సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. ఇక, మృణాల్‌ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ‘హాయ్ నాన్న’ చిత్ర బృందం ఆమె కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సినిమా డిసెంబర్ 21న విడుదల కానుంది.
Advertisement
Tollywood
Vijay Devarakonda
Mrunal Thakur

More Telugu News