మీడియాతో మాట్లాడుతూనే సొమ్మసిల్లిపడిపోయిన సీపీఐ అగ్రనేత డి.రాజా!
- మణిపూర్ లో పరిస్థితుల్ని అదుపు చేయడంలో కేంద్రం విఫలమైందంటూ సీపీఐ నిరసన
- చెన్నైలో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న రాజా
- విలేకరులతో మాట్లాడుతూనే కళ్లు తిరిగి పడిపోయిన రాజా
- వైద్య పరీక్షల అనంతరం ఇంటికి
ఈ సందర్భంగా రాజా విలేకరులతో మాట్లాడుతూనే తల తిరగడంతో కిందపడిపోయారు. వెంటనే పార్టీ కార్యకర్తలు ఆయనను కారు వద్దకు తీసుకెళ్లి, దగ్గరలోని స్టాన్లీ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన ఇంటికి వచ్చారు. రాజా పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు.