తెలంగాణ బడి వేళల్లో మార్పులు

తెలంగాణ బడి వేళల్లో మార్పులు

School timings in Telangana changed
  • భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం
  • ఉదయం గం.9.30 నుండి సాయంత్రం గం.4.15 వరకు ప్రాథమిక పాఠశాల
  • ఉదయం గం.9.30 నుండి సాయంత్రం గం.4.45 వరకు ఉన్నత పాఠశాల
  • హైదరాబాద్, సికింద్రాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా స్కూల్ వేళల మార్పులు
భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల వేళల్లో మార్పులు చేసింది. రేపటి నుండి ఉదయం గం.9.30 నుండి సాయంత్రం గం.4.15 వరకు ప్రాథమిక పాఠశాలలు, ఉదయం గం.9.30 నుండి సాయంత్రం గం.4.45 వరకు ఉన్నత పాఠశాలలు పని చేస్తాయని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో ఈ మార్పులు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. హైదరాబాద్, సికింద్రాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా స్కూల్ వేళల్లో మార్పులు చేశారు.
Advertisement
Telangana
school

More Telugu News