సినిమా సక్సెస్ మీట్‌లో తండ్రిని గుర్తు చేసుకొని కంటతడి పెట్టిన హీరోయిన్

Nandita Swetha emotional on stage
  • అశ్విన్ బాబు -నందిత శ్వేత ప్రధాన పాత్రలుగా హిడింబ సినిమా
  • దర్శకుడు తనపై ఎంతో నమ్మకం ఉంచారన్న నందిత శ్వేత
  • ఈ సినిమా షూట్ లో ఉన్నప్పుడే తండ్రి చనిపోయారని ఉద్వేగం
హిడింబ సినిమా హీరోయిన్ నందితా శ్వేత శుక్రవారం వేదిక పైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. అశ్విన్ బాబు, నందిత శ్వేత ప్రధాన పాత్రలు పోషించిన హిడింబ సినిమాను అనిల్ కన్నెగంటి తెరకెక్కించారు. వీరిద్దరూ ఈ సినిమాలో పోలీస్ పాత్రల్లో నటించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో నటి భావోద్వేగానికి లోనయ్యారు.

హిడింబ సినిమాలో తనకు అవకాశం వచ్చినప్పుడు ఇలాంటి రోల్ చేస్తానని తాను అనుకోలేదని, దర్శకుడు తనపై ఎంతో నమ్మకం ఉంచారని నందిత శ్వేత అన్నారు. దర్శకుడితో పాటు అనిల్ వల్ల తాను తన పాత్రకు న్యాయం చేయగలిగానని చెప్పారు. తనకు ఈ సినిమాతో మంచి పేరు వచ్చిందన్నారు. ఈ చిత్ర బృందంతో తనకు మంచి అనుబంధం ఏర్పడిందని, నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను తీశారన్నారు. ఈ సినిమా షూట్ లో ఉన్నప్పుడే తన తండ్రి చనిపోయారని, తన తండ్రి ఆశీస్సులతోనే ఈ రోజు తనకు పేరు వచ్చిందని ఆమె కంటతడి పెట్టారు.
Advertisement
cinema
Tollywood

More Telugu News