చిన్న తప్పు కూడా పెద్ద నష్టం కలిగిస్తుంది: ఇంటర్న్‌లకు నిర్మలా సీతారామన్ కీలక సందేశం
- ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ స్కీమ్ కింద పనిచేస్తున్న ఇంటర్న్‌లతో నిర్మలా సీతారామన్ సమావేశం
- ఏ పని చేసినా జాగ్రత్తగా, పరిపూర్ణంగా చేయాలని నిర్మల సూచన
- మనం చేసే తప్పు ఇతరులకు నష్టం కలిగించవచ్చన్న నిర్మల
ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ స్కీమ్ (పీఎంఐఎస్) కింద పనిచేస్తున్న ఇంటర్న్‌లతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె యువతకు ముఖ్యమైన సందేశం ఇచ్చారు. “మీరు ఏ పని చేసినా జాగ్రత్తగా, పరిపూర్ణంగా చేయాలి. ఎందుకంటే చిన్న తప్పు కూడా వేరొకరికి తీవ్ర పరిణామాలు కలిగించవచ్చు” అని ఆమె చెప్పారు.
మోటార్‌సైకిల్ తయారీలో ఒక చిన్న భాగంలో తప్పు జరిగితే, కొనుగోలు చేసిన వ్యక్తికి ప్రమాదం, నష్టం కలగవచ్చని ఉదాహరణగా చెప్పారు. బ్యాంకింగ్ రంగంలో కూడా ఒక వెయ్యి రూపాయల బదులు లక్ష రూపాయలు పంపితే నష్టం ఎవరికి వస్తుందని ప్రశ్నించారు. డిజిటల్ సమాచారం నిర్వహణలో తప్పు జరిగితే కస్టమర్‌కు కొత్త సమస్యలు వస్తాయని హెచ్చరించారు.
“మీరు నష్టపోరు, వేరొకరు భరించాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి క్షణం పరిపూర్ణంగా పని చేయండి” అని ఆమె సూచించారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాల నుంచి వచ్చిన ఇంటర్న్‌లు పరిశ్రమ అనుభవం, నైపుణ్యాలు సంపాదిస్తున్నారని నిర్మలా సీతారామన్ అభినందించారు. పీఎంఐఎస్ పథకం ద్వారా యువతకు భారత్‌లోని టాప్ 500 కంపెనీల్లో 12 నెలల హ్యాండ్స్-ఆన్ అనుభవం లభిస్తోందని, విద్యా-పరిశ్రమ మధ్య గ్యాప్‌ను తగ్గించడమే దీని లక్ష్యమని తెలిపారు.