సోనియా, రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానం భోపాల్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్

Rahul Gandhi Mother Sonias Flight Makes Emergency Landing In Bhopal
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆమె తల్లి సోనియా గాంధీ ప్రయాణిస్తున్న విమానం మంగళవారం సాయంత్రం అత్యవసరంగా భోపాల్ లో ల్యాండ్ అయింది. ప్రతిపక్షాల సమావేశానికి హాజరయ్యేందుకు వారు బెంగళూరుకు వచ్చారు. ఈ సమావేశం అనంతరం తిరిగి బెంగళూరు నుండి ఢిల్లీకి బయలుదేరారు. అయితే వాతావరణం ప్రతికూలంగా మారడంతో భోపాల్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.

26 ప్రతిపక్షపార్టీల మేధోమథనం బెంగళూరులో జరిగింది. విపక్షాలు తమ కూటమికి ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయెన్స్ (I-N-D-I-A) అని నామకరణం చేసుకున్నారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో I-N-D-I-A వర్సెస్ ఎన్డీయేగా ఉంటుందని రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ సమావేశంలో అన్నారు. ఈ సమావేశం తర్వాత రాహుల్, సోనియాలు ఢిల్లీకి బయలుదేరగా, విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది.
Go Back to Shorts
Rahul Gandhi
Sonia Gandhi
Congress
bhopal

More Telugu News