యానాంలో హృదయాలను మెలితిప్పే దృశ్యం... ఆత్మహత్య చేసుకున్న యజమానురాలు తిరిగొస్తుందని చెప్పుల వద్దే కూర్చున్న శునకం

యానాంలో హృదయాలను మెలితిప్పే దృశ్యం... ఆత్మహత్య చేసుకున్న యజమానురాలు తిరిగొస్తుందని చెప్పుల వద్దే కూర్చున్న శునకం

Dog waiting for her owner who committed suicide
  • గోదావరి బ్రిడ్జిపై నుంచి నదిలో దూకిన యువతి
  • చెప్పులు బ్రిడ్జిపైనే విడిచిన వైనం
  • యజమానురాలు ఇక లేదన్న విషయం తెలియని శునకం
  • పగలు రాత్రి ఆ చెప్పుల వద్దే కాపలా
శునకాలు ఎంతటి విశ్వాసపాత్రమైనవో, ఎంతటి ప్రేమాభిమానాలు ప్రదర్శిస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యజమానులతో వాటి అనుబంధం ఎంత బలంగా ఉంటుందో ఈ ఘటన చెబుతుంది. యానాంలో ఇటీవల ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. గోదావరి నది బ్రిడ్జిపైకి వెళ్లిన ఆ యువతి, చెప్పులు విడిచి నదిలో దూకి బలవన్మరణం చెందింది. ఆ సమయంలో యువతి పెంపుడు కుక్క కూడా అక్కడే ఉంది. అయితే, యువతి ఆత్మహత్య చేసుకుని చనిపోయిందన్న విషయం తెలియని ఆ మూగప్రాణి ఆ చెప్పుల వద్దే కూర్చుని ఎదురుచూస్తోంది. రాత్రి పగలు ఆ శునకం చెప్పుల వద్దే కూర్చుని ఉండడం గమనించినవారు చలించిపోతున్నారు.
Advertisement
Dog
Owner
Suicide
Yanam

More Telugu News