చెక్ యువర్ ఓట్.. గెట్ యువర్ ఓట్: చంద్రబాబు
- ఈ నెల 21 నుంచి ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం జరుగుతుందన్న చంద్రబాబు
- ఇంటింటికీ వచ్చి బూత్ స్థాయి అధికారులు వెరిఫికేషన్ చేపడతారని వెల్లడి
- మీ ఓటు ఉందో, లేదో చెక్ చేసుకోవాలని సూచన
ఓటు మన బాధ్యత అని, ఓటుతోనే భద్రత అని, ఓటుతోనే భవిష్యత్తుకు భరోసా అని చంద్రబాబు తెలిపారు. ఈ నెల 21 నుంచి నెల రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వచ్చి ఓటర్ వెరిఫికేషన్ చేపడతారని తెలిపారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితాలో మీ ఓటు ఉందో, లేదో చెక్ చేసుకోండని సూచించారు. ఓటు లేకపోతే వెంటనే ఓటరుగా మీ పేరును నమోదు చేసుకోవాలని కోరారు.