Samantha: ఈ రోజు నా జీవితంలో చాలా ప్రత్యేకమంటూ అందరికీ గుడ్​బై చెప్పిన సమంత

Samantha wraps up Citadel India amid reports of a one year break from films
షార్ట్స్‌లో చూడండి
అగ్ర నటి సమంత ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తోంది. మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడిన సమంత.. దాని చికిత్స కోసం ఏడాదిపాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషి’ సినిమాతో పాటు, సిటాడెల్ హిందీ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. వీటి షూటింగ్ పూర్తైన వెంటనే సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీనికి బలం చేకూరుస్తూ మూడు రోజుల క్రితం సమంత.. ‘కారవాన్ లైఫ్.. మరో మూడు రోజులు మాత్రమే’ అంటూ ఇన్ స్టా స్టోరీస్ రాసింది. 
.తాజాగా ఈ రోజు తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజు అంటూ మరో పోస్ట్ చేసింది. ‘జులై 13 నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఈ రోజుతో సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తయింది’ అని పేర్కొంటూ కళ్ల జోడు పెట్టుకున్న ఓ ఫొటోను షేర్ చేసింది. అంతేకాదు సెట్ లో అందరికీ వీడ్కోలు చెబుతూ కనిపించింది. ఈ లెక్కన సమంత ఏడాది బ్రేక్ మొదలవనుంది. రాజ్‌-డీకే దర్శకత్వంలో రూపొందుతున్న ‘సిటాడెల్‌’ లో వరుణ్‌ధవన్‌, సమంత నటించారు. కాగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఖుషి’ సెప్టెంబర్ 1న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.
Go Back to Shorts
Samantha
Citadel
shooting
one year
break from films
Vijay Devarakonda

More Telugu News