విడదల రజనికి టీడీపీ నేత ప్రత్తిపాటి సెల్ఫీ ఛాలెంజ్!
- రజనికి వసూళ్లపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదని ఆరోపణ
- టీడీపీ చేసిన పనుల్లో 10 శాతమైనా వైసీపీ చేసిందా? అని ప్రశ్న
- జగన్ బటన్ సీఎంగా నిలిచిపోయారని ఎద్దేవా
ఈ సందర్భంగా మాట్లాడుతూ... చిలకలూరిపేట సమస్యలు ఎక్కడివి అక్కడే ఉండిపోయాయన్నారు. టీడీపీ హయాంలో రూ.16 కోట్లతో ఎస్టీపీ పనులు చేపట్టామన్నారు. పసుమర్రు వంతెన కోసం చంద్రబాబు రూ.7.6 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చి నాలుగేళ్లు దాటినా ఈ వంతెనను పూర్తి చేయలేదన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక గుత్తేదారుకు రూపాయి చెల్లించలేదని ఆరోపించారు. జగన్ రాష్ట్రానికి చేసిందేమీ లేదని, బటన్ సీఎంగా నిలిచిపోయారని ఎద్దేవా చేశారు.