గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీకి చుక్కెదురు
- మోదీ ఇంటి పేరుపై అనుచిత వ్యాఖ్యల కేసు
- తనపై ఉన్న నేరారోపణలను కొట్టివేయాలని కోరుతూ గుజరాత్ హైకోర్టులో రాహుల్ పిటిషన్
- కింది కోర్టు తీర్పును సస్పెండ్ చేయడానికి నిరాకరించిన హైకోర్టు
లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో గుజరాత్ హైకోర్టు తీర్పు కాంగ్రెస్ కు పెద్ద ఎదురు దెబ్బగానే చెప్పుకోవాలి. ఈ కేసులో ఆయనకు ఊరట లభించకపోతే పార్లమెంటు ఎన్నికల్లో ఆయన పోటీ చేయడానికి అవకాశం ఉండదు. మరోవైపు రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి.