Chandrayaan-3: చంద్రయాన్-3 ప్రయోగానికి ముహూర్తం ఖరారు చేసిన ఇస్రో

ISRO fixes time for Chandrayaan3
షార్ట్స్‌లో చూడండి
ఇప్పటికే రెండు దఫాలు చంద్రయాన్ ముశం ను చేపట్టి మిశ్రమ ఫలితాలు అందుకున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మూడోసారి చంద్రయాన్ చేపడుతోంది. చంద్రయాన్-3 ప్రయోగానికి మూహూర్తం ఖరారు చేసింది. జులై 14న మధ్యాహ్నం 2.35 గంటలకు చంద్రయాన్-3లో భాగంగా జీఎస్ఎల్వీ-ఎంకే3 లేక ఎల్వీమ్3 నింగిలోకి దూసుకెళ్లనుంది. 

ఈ ప్రతిష్ఠాత్మక ప్రయోగం కోసం శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ రాకెట్ ప్రయోగ కేంద్రం సన్నద్ధమవుతోంది. చంద్రయాన్-2లో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ ఉండగా... చంద్రయాన్-3లో ప్రొపల్షన్, ల్యాండర్, రోవర్ ను పొందుపరిచారు. 

చంద్రయాన్-2లోని ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై దిగే క్రమంలో విఫలమైన నేపథ్యంలో, అనేక మార్పులు చేర్పులతో చంద్రయాన్-3 ల్యాండర్ ను అభివృద్ధి చేశారు. విక్రమ్ ల్యాండర్ కు బలమైన కాళ్లు అమర్చారు. అత్యధిక వేగంగా దిగినప్పటికీ దెబ్బతినని రీతిలో ల్యాండర్ కు రూపకల్పన చేశారు. 

ఇంజిన్, సెన్సర్, థ్రస్ట్ వైఫల్యాలను గుర్తించి చక్కదిద్దేందుకు అధునాతన సాఫ్ట్ వేర్ ఉపయోగించనున్నారు. చంద్రయాన్-2 నుంచి నేర్చుకున్న గుణపాఠాల నేపథ్యంలో, చంద్రయాన్-3లో సెంటర్ ఇంజిన్ లేదా ఐదో ఇంజిన్ ను తొలగించనున్నారు. 

ఇక, విక్రమ్ లాండర్ చంద్రుడిపై సూర్యరశ్మి సోకని ప్రాంతంలో ల్యాండైనప్పటికీ ఇంధన శక్తిని పొందేందుకు వీలుగా మరిన్ని సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేస్తున్నామని ఇస్రో చైర్మన్ సోమ్ నాథ్ తెలిపారు.
Go Back to Shorts
Chandrayaan-3
ISRO
Sriharikota
India

More Telugu News