PAN: పాన్ తో ఆధార్ అనుసంధానానికి నేడే తుది గడువు

PAN and AADHAR link up dead line will end today
షార్ట్స్‌లో చూడండి
పాన్ కార్డును ఆధార్ తో అనుసంధానం చేసేందుకు కేంద్రం ఇప్పుటికే అనేక పర్యాయాలు గడువు పెంచుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల రూ.1000 పెనాల్టీతో పొడిగించిన గడువు నేటితో ముగియనుంది. ఆధార్ తో అనుసంధానం చేయని పాన్ కార్డులు జులై 1 నుంచి పనిచేయవని కేంద్ర ఆదాయ పన్ను శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. 

కేంద్ర నిబంధనల ప్రకారం పాన్ కార్డు కలిగివున్న ప్రతి వ్యక్తి ఆదాయ పన్ను చట్టం-1961 ప్రకారం... పాన్ కార్డును ఆధార్ వివరాలతో అప్ డేట్ చేయాల్సిందే. 

కాగా, ఆధార్ ను పాన్ కు లింక్ చేయని వారు ఇంకా చాలామందే ఉన్నారని, అందుకే కేంద్రం మరోసారి గడువు పొడిగించే అవకాశాలు ఉన్నాయని  ఊహాగానాలు వస్తున్నాయి. దీనిపై కేంద్రం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.
Go Back to Shorts
PAN
AADHAR
Income Tax
India

More Telugu News