Ramakuppam: మహా ధర్నాకు టీడీపీ పిలుపు.. రామకుప్పంలో హైటెన్షన్

High tension in Ramakuppam as TDP calls for maha dharna
షార్ట్స్‌లో చూడండి
చిత్తూరు జిల్లా రామకుప్పంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే రామకుప్పం ఎస్సై కృష్ణయ్య కులం పేరుతో మాజీ సర్పంచ్ మహాదేవి జయశంకర్ దంపతులను దూషించారంటూ పోలీస్ స్టేషన్ ఎదుట టీడీపీ మహాధర్నాకు పిలుపునిచ్చింది. పార్టీ పిలుపు మేరకు కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుంటున్నాయి. కాసేపట్లో మహాధర్నా ప్రారంభంకాబోతోంది. 

ఈ నేపథ్యంలో పీఎస్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు ఎస్సై తమను కులం పేరుతో దూషించారంటూ బాధితులు కుప్పంలో జడ్జికి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కోర్టు ఆవరణలోనే ఎస్సై తమపై బూతులతో విరుచుకుపడ్డారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సై నుంచి తమకు ప్రాణ హాని ఉందని చెపుతున్నారు. 

Go Back to Shorts
Ramakuppam
Telugudesam
Maha Dharna

More Telugu News